స్వేదపత్రం పేరుతో కేటీఆర్‌వి పిల్ల చేష్టలు: షబ్బీర్‌ అలీ | Shabbir Ali Comments On Ktr | Sakshi
Sakshi News home page

స్వేదపత్రం పేరుతో కేటీఆర్‌వి పిల్ల చేష్టలు: షబ్బీర్‌ అలీ

Dec 26 2023 7:20 PM | Updated on Dec 26 2023 7:50 PM

Shabbir Ali Comments On Ktr - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: స్వేద పత్రం పేరుతో కేటీఆర్ పిల్ల చేష్టలు చేశారంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ నిజామాబాద్‌లో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అధికారుల నుంచి వివరాలు సేకరించి శ్వేత పత్రం విడుదల చేసిందని.. ప్రభుత్వ శ్వేత పత్రం తప్పు అని బీఆర్‌ఎస్‌ నేతలు ఎలా చెబుతారని ప్రశ్నించారు.

దమ్ముంటే కేటీఆర్ తప్పులు  నిరూపించాలని సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు ప్రభుత్వమే ఇస్తుందని వివరించారు.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ఉంటే పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 100 మందికి ఓ కౌంటర్ పెట్టి దరఖాస్తులు ప్రభుత్వమే ఇస్తుందన్నారు. మీ సేవ కేంద్రాల్లో గంటల తరబడి క్యు కట్టాల్సిన అవసరం లేదన్నారు.

ఇదీ చదవండి: పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌..

Advertisement
 
Advertisement
Advertisement