‘ఎమ్మెల్యే వనమాకు ఇంకా రాజకీయాలెందుకు?’ | Health Director Srinivas Political Counter To MLA Vanama Venkateshwara Rao | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే వనమా రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ తీసుకోవాలి: హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌

May 21 2023 6:31 PM | Updated on May 21 2023 6:46 PM

Health Director Srinivas Political Counter To MLA Vanama Venkateshwara Rao - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస రావు మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలిచారు. ఈసారి వనమా వెంకటేశ్వర రావును టార్గెట్‌ చేసి శ్రీనివాస రావు పొలిటికల్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, శ్రీనివాస్‌ రావు ఆదివారం ఓ కార్యక్రమం‍లో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వనమా రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ తీసుకోవాలి. వనమాకు ఇంకా రాజకీయాలు ఎందుకు? అని సంచలన కామెంట్స్‌ చేశారు. గత ఎన్నికలే నాకు లాస్ట్‌ ప్లీజ్‌ అని అప్పుడు వనమా అన్నారు. 80ఏళ్ళు వచ్చాయి ఇక రిటైర్మెంట్ తీసుకోవాలి అని సూచించారు. ఇదే క్రమంలో వనమాకు కౌంటర్‌ ఇచ్చారు. మంచి చేయడానికి వస్తే అడ్డుకుంటారా. మంచి చేయాలనుకునే వారిని అనుసరించాలనుకునే వారిని అడ్డు కోవడం ఏం నీతి? అని ప్రశ్నించారు. అందరినీ ఫోన్లో బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. 

మరోవైపు.. నేను ఉల్వనూరులో ఇల్లు కట్టుకుంటాను. నా శరీరం ఇక్కడి మట్టిలో కలిపోతుందని ఉద్వేగంతో కామెంట్స్‌ చేశారు. ఈ క్రమంలోనే కొత్త కొత్తగూడెంను నిర్మించుకుందామని అన్నారు. మీరంతా నాతో కలిసి నడవడానికి సిద్దంగా ఉన్నారా? అన్ని ప్రశ్నించారు. నాతో మద్దతు తెలిపే వారు చేతులెత్తండి అని.. ఆ వెంటనే అందరూ చేతులెత్తాలని సూచించారు. ఇక, శ్రీనివాస రావు కామెంట్స్‌తో కొత్తగూడెంలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. 

ఇది కూడా చదవండి: కిషన్‌రెడ్డి సంచలన కామెంట్స్‌


 

Advertisement
 
Advertisement
Advertisement