రా... కదలిరాలో కిందపడబోయిన చంద్రబాబు.. ఆగ్రహం | Chandrababu Angry With TDP Workers At Katheru Raa Kadali Raa | Sakshi
Sakshi News home page

జనసేన ఎఫెక్ట్‌: రా... కదలిరాలో నిరసన సెగ: కిందపడబోయిన చంద్రబాబు.. ఆగ్రహం

Jan 29 2024 3:39 PM | Updated on Feb 5 2024 5:08 PM

Chandrababu Angry With TDP Workers At Katheru Raa Kadali Raa - Sakshi

చంద్రబాబు రా కదలి రా సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఏకంగా ఆయన్నే కిందపడేసేందుకు యత్నం.. 

 సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ కార్యకర్తలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కోపమొచ్చింది. రాజానగరం టికెట్‌ కేటాయింపు అసంతృప్తి సెగలు ఆయనకు తగిలాయి. ఈ క్రమంలో రాజమండ్రి రూరల్‌ కాతేరులో సోమవారం ఆయన నిర్వహించిన రా కదలి రా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

రాజానగరం టికెట్‌ జనసేనకు కేటాయించడంపై చంద్రబాబు సమక్షంలో బొడ్డు వెంకటరమణ వర్గీయులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో స్టేజ్‌ పైనుంచి కార్యకర్తలు దూకుడుగా దిగే యత్నం చేయగా.. చంద్రబాబు కిందపడబోయారు. అయితే సెక్యూరిటీ ఆయన్ని కిందపడకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ఇదేం తీరు తమ్ముళ్లూ.. అంటూ సొంత పార్టీ కార్యకర్తల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement