వ్యభిచార ముఠా పట్టివేత.. మహిళ అరెస్ట్‌ | Thane: Prostitution Racket Busted, Woman Arrested | Sakshi
Sakshi News home page

వ్యభిచార ముఠా పట్టివేత.. మహిళ అరెస్ట్‌

Dec 10 2022 2:22 PM | Updated on Dec 10 2022 2:38 PM

Thane: Prostitution Racket Busted, Woman Arrested - Sakshi

సాక్షి, థానె: గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్న ఓ మహిళను మానవ అక్రమ రవాణా నిరోధక శాఖ విభాగం పోలీసులు రెడ్‌ హ్యెండెడ్‌గా పట్టుకున్నారు. రాష్ట్రంలోని థానె నగరంలో ఓ ఖరీదైన ప్రాంతంలో అదే ప్రాంతానికి చెందిన మహిళ బయట ప్రాంతాలకు చెందిన నలుగురు యువతులను తెప్పించి వారితో వ్యభిచారం చేయిస్తోందన్న సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం వలపన్ని పట్టుకున్నారు.

కాగా ఈ వ్యభిచార ముఠా నుంచి నలుగురు యువతుల్ని పోలీసులు రక్షించారు. వారిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. వీరిని వ్యభిచార రొంపిలోకి దించిన సదరు మహిళను పోలీసులు అరెస్టు చేసి ఆమెపై ఐపీసీ, మావన అక్రమ రవాణా నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement