లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడి
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కొత్తగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడితే.. నియమ నిబంధనల ప్రకారం దానిని పరిశీలిస్తామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం చెప్పారు. జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తప్పించేందుకు ప్రతిపక్షాలు ఇప్పటికే రెండుసార్లు ప్రయతి్నంచాయి. మొదట లోక్‌సభ, రాజ్యసభ నోటీసులు ఇవ్వగా తిరస్కరణకు గురయ్యాయి.
రెండోసారి సమరి్పంచిన నోటీసు రాజ్యసభలో ఇంకా పెండింగ్‌లో ఉంది. ఓం బిర్లా గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఈసీపై అభిశంసన విషయంలో నిబంధనల ప్రకారమే నడుకుంటానని తేలి్చచెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
రాజ్యాంగం, ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్టం ప్రకారం.. పదవిలో ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన ప్రవేశపెట్టిన విధంగానే పార్లమెంట్ ద్వారా మాత్రమే సీఈసీని తొలగించవచ్చు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల(నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) చట్టం–2023 ప్రకారం.. సీఈసీ లేదా ఎన్నికల కమిషనర్ రాష్ట్రపతికి లిఖితపూర్వకంగా రాజీనామా సమరి్పంచి, పదవి నుంచి తప్పుకోవచ్చు.
సుప్రీంకోర్టుకు సంబంధించిన 124వ అధికరణం ప్రకారం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుండి తొలగించాలంటే అందుకు తగిన కారణాలు (ప్రవర్తనా లోపం లేదా అసమర్థత) ఉండాలి. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతి సభలోనూ హాజరై ఓటు వేసిన సభ్యుల్లో కనీసం మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందాలి. అటువంటి తీర్మానాన్ని రాష్ట్రపతికి సమర్పించిన తర్వాత.. రాష్ట్రపతి జారీ చేసే ఉత్తర్వు ద్వారా మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుండి తొలగించవచ్చు. ఒకవేళ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలనుకుంటే ఇదే ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది.


