సాక్షి,న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మంగళవారం కీలక అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య చర్చలు ఆత్మీయంగా, ఫలప్రదంగా సాగాయని మోదీ వెల్లడించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఏర్పడిన సానుకూల పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతల మద్య అంగీకారం కుదిరినట్టు ఆయన తెలిపారు.
ఈ చర్చల్లో వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, ప్రజల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు మోదీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలక రంగాల్లో స్పష్టమైన ఫలితాలు సాధించడమే లక్ష్యమని తెలిపారు.
Had a warm and productive conversation with Prime Minister Mark Carney. We agreed to build on the positive momentum in India-Canada ties and work towards concrete outcomes across key areas of our Strategic Partnership, including trade, energy, technology, security and people-to-people ties. Together, India and Canada are contributing towards a more stable and prosperous world. @MarkJCarney
— Narendra Modi (@narendramodi) October 13, 2026
ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు కెనడా ప్రధాని మార్క్ కార్నీని ముఖ్య అతిథిగా ఆహ్వానించే అవకాశాన్ని భారత్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఖరారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో కీలక పరిణామం.. ఇద్దరు పైలట్ల అరెస్ట్!


