ఫాం–7 తొలగింపు దరఖాస్తులపై ఈసీ పరిమితి  | Election Commission caps Form 7 objection applications by individual electors | Sakshi
Sakshi News home page

ఫాం–7 తొలగింపు దరఖాస్తులపై ఈసీ పరిమితి 

Oct 10 2026 5:54 AM | Updated on Oct 10 2026 5:54 AM

Election Commission caps Form 7 objection applications by individual electors

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల నుంచి పేర్లను తొలగించాలంటూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందజేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఈ దరఖాస్తులపై పరిమితి విధించింది. ఫాం–7కు సంబంధించి ఒక్కో వ్యక్తి గరిష్టంగా 10 దరఖాస్తులను మాత్రమే అందజేయాలని స్పష్టం చేసింది. అధికారులు అంతకుమించి ఆమోదించబోరని పేర్కొంది. 

ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ దుర్వినియోగం కాకుండా, అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించకుండా నిరోధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామంది. పరిమితి వల్ల అధికారులపై పనిభారం తగ్గుతుందని కూడా ఈసీ వివరించింది. ఇలాంటి దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అధికారులు ఆ ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. వారి వాదనలను వ్యక్తిగతంగా విని, తగు ఆధారాలను పరిశీలించి సంతృప్తి చెందినట్లయితే తొలగింపు అభ్యర్థనను కొట్టిపారేస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement