కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి | Bus Overturns On Delhi Mumbai Expressway In Rajasthan Kota | Sakshi
Sakshi News home page

కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి

Oct 17 2026 9:25 AM | Updated on Oct 17 2026 9:31 AM

Bus Overturns On Delhi Mumbai Expressway In Rajasthan Kota

రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 25 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు కాలువలో పడిపోవడంతో ఎనిమిది మంది మృతి చెందారు. ఉదయం సుమారు 6 గంటల సమయంలో సిమ్లియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 15 అడుగుల ఎత్తు నుంచి బస్సు కాలువలో పడిపోయినట్లు సమాచారం.

నీరు, బురదతో నిండిన కాలువలోకి బస్సు పడిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు క్రేన్‌ సహాయంతో సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. బస్సులో 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఆ ఆడియోతో షాకయ్యా.. మహిళా మంత్రి కన్నీళ్లు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement