chandigarh: మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం | BJP Harpreet Kaur Babla Chandigarh Mayor | Sakshi
Sakshi News home page

chandigarh: మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం

Jan 30 2025 1:59 PM | Updated on Jan 30 2025 1:59 PM

BJP Harpreet Kaur Babla Chandigarh Mayor

చండీగఢ్: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఘోర పరాజయం పాలయ్యాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించింది. బీజేపీకి చెందిన హర్‌ప్రీత్ కౌర్ బాబ్లా మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా క్రాస్ ఓటింగ్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి మొత్తం 19 ఓట్లు వచ్చాయి. 

ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు మొత్తంగా 17 ఓట్లు వచ్చాయి. మొత్తం 36 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ పార్టీలో మొత్తం 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు క్రాస్ ఓట్ చేశారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య 13, కాంగ్రెస్‌ కౌన్సిలర్ల సంఖ్య 6. ఓటింగ్ సమయంలో సభలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం చండీగఢ్ మేయర్ ఎన్నికల(Chandigarh Mayoral Election) కేసులో సుప్రీంకోర్టు పంజాబ్- హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జైశ్రీ ఠాకూర్‌ను స్వతంత్ర పరిశీలకునిగా నియమించింది. ఈసారి చండీగఢ్ మేయర్ పదవికి ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా చూస్తామని ఆ సమయంలో కోర్టు చెప్పింది.

గత ఏడాది ఫిబ్రవరి 20న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు కీలక తీసుకుంది. నాడు సుప్రీంకోర్టు(Supreme Court) ఓట్ల లెక్కింపును తిరిగి నిర్వహించాలని ఆదేశించింది. చెల్లనివిగా ప్రకటించిన 8 బ్యాలెట్లను చెల్లుబాటు అయ్యేవిగా ప్రకటించారు. బ్యాలెట్ పత్రాలను పరిశీలించి, వీడియో చూసిన తర్వాత ఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు, రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్‌ను మందలించి, షోకాజ్ నోటీసు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: ఆకాశం నిర్మలంగా ఉన్నా ప్రమాదం ఎలా జరిగింది?.. ట్రంప్‌ సందేహం

Advertisement
 
Advertisement
Advertisement