
బాబ్రీ మసీదు కూల్చివేత
1996 డిసెంబర్ 6న అయోధ్యకు పెద్ద ఎత్తున చేరుకున్న విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేశారు. శ్రీరాముడి జన్మస్థలం అని భావించే ప్రదేశంలో ముస్లిం రాజులు బాబ్రీ మసీదును నిర్మించారన్న వివాదం శతాబ్దాలుగా ఉంది. ఆ వివాదం చివరికి మసీదు ధ్వంసానికి దారి తీసింది. మసీదు వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించిన లక్షా 50 వేల మంది కరసేవకుల ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో మసీదు ధ్వంసం అయిన పర్యవసానంగా దేశంలో సున్నితమైన పరిస్థితులున్న ప్రాంతాల్లో మత కలహాలు సంభవించాయి. మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలోని హిందువులపై ప్రతీకార దాడులు జరిగాయి. నాటి ప్రధాని పి.వి. నరసింహారావు, రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ.. ‘జరిగి ఉండాల్సింది కాని ఒక దురదృష్టకర పరిణామం’గా అయోధ్య ఘటనను వ్యాఖ్యానించారు.
ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
– రూపాయి మారకం విలువ కుప్పకూలిపోయింది.
– స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా ప్రమేయం ఉన్నట్లుగా నిర్థారణ అయిన పది వేల కోట్ల రూపాయల కుంభకోణం బట్టబయలు.
– స్టాక్ ఎక్ఛేంజ్ రెగ్యులేటర్.. ‘సెబీ’ స్థాపన.