సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి | Sakshi
Sakshi News home page

సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి

Published Tue, Mar 26 2024 1:05 AM

రైతులకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను 
వివరిస్తున్న మదన్‌గుప్తా - Sakshi

గరిడేపల్లి: రైతులు, యువత సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని తెలంగాణ గో సేవా విభాగం సభ్యుడు పి. మదన్‌గుప్తా అన్నారు. గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ వ్యవసాయంపై నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. సమగ్ర వ్యవసాయ విధానాలు, రైతుల ఆదాయం రెట్టింపు చేసే పంటలను ఎంచుకోవాలని సూచించారు. రసాయన ఎరువులు వాడటం ద్వారా భూమి కలుషితమవుతుందని, సేంద్రియ వ్యవసాయం ద్వారా భూమితో పాటు మానవ ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చని తెలిపారు. సేంద్రియ వ్యవసాయంలో వాడే వివిధ రకాల ద్రావణాలు, కషాయాల తయారీ విధానాలను కూడా వివరించారు. ఆవు పేడ, మూత్రం ద్వారా సబ్బులు, షాంపులు, అగర్‌బత్తుల తయారు చేసి ఉపాధి పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో కేవీకే మృత్తికా శాస్త్రవేత్త కిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement