ఎన్నికల సామగ్రి, శిక్షణ కరదీపికల పరిశీలన | Sakshi
Sakshi News home page

ఎన్నికల సామగ్రి, శిక్షణ కరదీపికల పరిశీలన

Published Wed, Mar 27 2024 12:50 AM

శిక్షణ కరదీపికలను పరిశీలించిన నోడల్‌ 
అధికారులు గోపాల్‌నాయక్‌, కార్తీక్‌ కుమార్‌ - Sakshi

నాగర్‌కర్నూల్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్‌ స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచిన ఎన్నికల సామగ్రి(ఎన్నికల సంఘం నుంచి జిల్లాకు వచ్చిన), శిక్షణ కరదీపికలను ఎన్నికల నోడల్‌ అధికారులు గోపాల్‌ నాయక్‌, కార్తీక్‌ కుమార్‌ మంగళవారం పరిశీలించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి అమలు చేసేలా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి పోలింగ్‌ కేంద్రం పీఓ వరకు అమలు చేయాల్సిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి, వివిధ అనుమతులు, నామినేషన్లు, ఎంసీసీ, ఎంసీఎంసీ, ఇతర అంశాల వారీగా కరదీపికలను వారు పరిశీలించారు. ఓటరు అవగాహన, ఓటరు మ్యాప్‌ కరదీపికలను మండలాలకు చేరవేత తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల సందర్భంగా పాటించాల్సిన అన్ని నిబంధనలను పాటిస్తూ.. కలెక్టర్‌, కొత్తగా ఎన్నికల సంఘం జారీ చేసే సూచనలను సైతం దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వహించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు శిక్షణ నోడల అధికారి గోపాల్‌ నాయక్‌ ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సూపరింటెండెంట్‌ యూసుఫ్‌, కలెక్టరేట్‌ సిబ్బంది నజీర్‌, బాలరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement