పెళ్లి పీటలెక్కనున్న బలగం బ్యూటీ.. వరుడు ఎవరంటే | ‘Balagam’ Beauty Kavya Is in a Relationship with Kala Birava He Confirms It on Instagram | Sakshi
Sakshi News home page

Kavya Kalyanram: బలగం బ్యూటీకి పెళ్లి కళ.. వరుడు అతడే

Aug 31 2026 4:38 PM | Updated on Aug 31 2026 5:45 PM

‘Balagam’ Beauty Kavya Is in a Relationship with Kala Birava He Confirms It on Instagram

బలగం బ్యూటీ కావ్య, సంగీత దర్శకుడు కాల భైరవ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. వీరిద్దరు గత కొంత కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ప్రకటించారు. జీవితాంతం కలిసి ఉంటామని చెప్పడానికి చాలా ఆనందంగా ఉందని ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ పెట్డారు ఈ జంట. ఈ విషయం తెలిసిన అభిమానులు ఈ జంటకు విషెస్ చెబుతున్నారు.

చైల్డ్‌ ఆర్టెస్ట్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన కావ్య కల్యాణ్‌రామ్‌ ‘బలగం’, తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు కీరవాణి కొడుకు కాలభైరవ. వీరిద్దరు గత కొంత కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ ఎట్టకేలకు వీరిద్దరు తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు. 


ఎక్కువమంది చదివింది: అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్‌ పెట్టా..!

మనిద్దరం ఒకరికొకరం కుటుంబంగా ఉండబోతున్నాం..
కావ్య ఫొటోస్‌ని భైరవ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘నీతో సమయం గడపడం అంటే.. కొండల మధ్య కూర్చొని.. పక్కనే పారుతున్న సెలయేరును చూస్తున్నట్లుగా ఉంటుంది. నీతో కలిసి ఏదైనా చేయడం అంటే. ముగియకూడదనిపించే విహారయాత్రకు వెళ్లినట్లుగా ఉంటుంది. నీతో మాట్లాడటం అంటే.. చలికాలం తెల్లవారుజామున నాకు ఇష్టమైన కాఫీని ఆస్వాదించినట్లుగా ఉంటుంది. 
ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా ఎన్నో ఉన్నాయి. చాలా కాలం వరకు ఆ అనుభూతికి ఏ పేరు పెట్టాలో నాకు తెలియలేదు. కానీ మన ప్రయాణంలో ఎక్కడో ఒకచోట ఆ భావన ఏంటో నాకు అర్థమైంది. అది ‘కుటుంబం’ అనే అనుభూతి.  నిన్ను మొదటిసారి కలిసినప్పుడు.. ఒక కొత్త వ్యక్తిని కలిసినట్లు అనిపించలేదు. అప్పటికే నాకు తెలిసిన నా ఇంటికి తిరిగి వచ్చినట్టుగా అనిపించింది. అప్పటి నుంచి అక్కడి నుంచి నేను బయటకు రాలేదు. ఇప్పుడు ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.  ఇక జీవితాంతం.. మనిద్దరం ఒకరికొకరం ‘కుటుంబం’గా ఉండబోతున్నాం.‘ అని పోస్ట్‌ చేశాడు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement