పిల్లి బొమ్మ వస్తుంది! | Vishwak Sen Launched Narayana and Co Movie Trailer | Sakshi
Sakshi News home page

పిల్లి బొమ్మ వస్తుంది!

Jun 24 2023 12:40 AM | Updated on Jun 24 2023 10:14 AM

Vishwak Sen Launched Narayana and Co Movie Trailer - Sakshi

‘నెక్ట్స్‌ టెన్‌ డేస్‌లో చాలా పెద్ద డీల్‌ ఉంది. దుబాయ్‌ నుంచి ముంబైకి ఒక పిల్లి బొమ్మ వస్తుంది. దాన్ని చాలా సేఫ్‌గా మన దగ్గరకు చేర్చాలి’ అనే డైలాగ్‌తో ‘నారాయణ అండ్‌ కో’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. సుధాకర్‌ కోమాకుల హీరోగా చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘నారాయణ అండ్‌ కో’.

పాపిశెట్టి ఫిల్మ్‌ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్‌ కోమాకుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను హీరో విశ్వక్‌ సేన్‌ రిలీజ్‌ చేశారు ‘‘చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘నారాయణ అండ్‌ కో’ రూపొందింది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement