మనసుకు హత్తుకునే ప్రేమకథ | Vijay Deverakonda launches Annapurna Photo Studio trailer Launch | Sakshi
Sakshi News home page

మనసుకు హత్తుకునే ప్రేమకథ

Jul 3 2023 4:21 AM | Updated on Jul 3 2023 4:21 AM

Vijay Deverakonda launches Annapurna Photo Studio trailer Launch - Sakshi

విజయ్‌ దేవరకొండ, చైతన్య, లావణ్య

‘నేడే చూడండి.. మీ అభిమాన థియేటర్లలో ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ సినిమా ట్రైలర్‌. చైతన్య రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వం వహించిన పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ‘ఇచ్చట ఫోటోలు అందంగా తీయబడును’ అనేది క్యాప్షన్‌. బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకంపై యష్‌ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో విజయ్‌ దేవరకొండ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ బాగుంది. ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి. యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. ‘‘1980–1990 నేపథ్యాన్ని మళ్లీ గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు చైతన్య రావ్‌. ‘‘ఫస్టాఫ్‌ ఫన్నీగా, సెకండాఫ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా కథనం సాగుతుంది’’ అన్నారు చెందు ముద్దు, యష్‌ రంగినేని. ‘మనసుకు హత్తుకునే అందమైన ప్రేమకథ’, ‘చంటి జాతకంలో ప్రాణగండం ఉంది’, ‘ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో చావు తప్ప నాకు వేరే దారి లేదు’ వంటి డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement