Urfi Javed Hits Out at Hindustani Bhau Comments On Social Media - Sakshi
Sakshi News home page

Urfi Javed: 'ఇంకోసారి ఆ డ్రెస్సులు వేసుకుంటే చంపేస్తాం'... నటికి వార్నింగ్

Nov 13 2022 9:04 PM | Updated on Nov 14 2022 6:13 PM

Urfi Javed hits out at Hindustani Bhau Comments On Social Media - Sakshi

పొట్టి పొట్టి డ్రెస్సులతో ఎప్పుడు వివాదాల్లో వినిపించే నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ ఉర్ఫీ జావెద్. మరీ ఆమె వేసుకున్న డ్రెస్సులు అలా ఉంటాయి. ఆమె ఫ్యాషన్‌ను మరెవ్వరూ కూడా ఫాలో కాలేరు. ఆమె డ్రెస్సింగ్‌ చూసి  ఇదేం ఫ్యాషన్‌ రా బాబు ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఆ డ్రెస్సులతో అంతలా ఫేమస్ అయింది ఈ భామ. కాగితాలతో, వైర్లతో, చైన్లతో, అద్దాలతో, గోనె సంచితో ఇలా ఒక్కటేమిటి.. రకరకాల డ్రెస్సులతో కళ్లకు కనిపించిన దేన్నీ వదిలిపెట్టలేదు ఈ బిగ్ బాస్ బ్యూటీ. 

(చదవండి: Urfi Javed: అందరి కళ్లు ఉర్ఫీ డ్రెస్సుల మీదే, డిజైనర్‌ ఎవరో తెలుసా?)

తాజాగా ఆమె విచిత్రమైన ఫ్యాషన్ దుస్తులపై హిందుస్థానీ భావు అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోల్డ్ దుస్తుల్లో కనిపించడం మానేయాలని ఓ వీడియోలో ఆమెను బెదిరించారు. ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉర్ఫీని బెదిరించడంతో హిందుస్థానీ భావుపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె అతనికి వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో అందరూ నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని  హిందుస్తానీ భావును ఉద్దేశించి ఉర్ఫీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. 'ఇప్పుడు మీరు నన్ను బహిరంగంగా బెదిరించారు. నేను తలచుకుంటే మిమ్మల్ని కటకటాల వెనక్కి నెట్టగలనని మీకు తెలుసు. ఏది ఏమైనా నాకు ఏది నచ్చిదే అది వేసుకుంటూనే ఉంటా.' అంటూ రాసుకొచ్చింది ఈ భామ. ఇలాంటి పరిణామాలతో తన భద్రతపై ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement