అక్కినేని హీరోకు సమంత విషెస్.. పోస్ట్ వైరల్! | Tollywood Actress Samantha Birthday Wishes To Akkineni Akhil | Sakshi
Sakshi News home page

Samantha: అఖిల్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన సామ్.. పోస్ట్ వైరల్!

Apr 8 2024 7:41 PM | Updated on Apr 8 2024 9:06 PM

Tollywood Actress Samantha Birthday Wishes To Akkineni Akhil - Sakshi

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిచయం ‍అక్కర్లేని పేరు. టాలీవుడ్‌లో అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇండియన్ వర్షన్‌ సిటాడెల్‌ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. వరుణ్ ధావన్‌తో కలిసి ఇందులో కనిపించనుంది. తాజాగా సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. 

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్‌ బర్త్‌ డే విషెస్ తెలిపింది సామ్. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. క్యూట్ పప్పీతో అఖిల్‌ ఉన్న ఫోటోను పంచుకుంది. హ్యాపీ బర్త్‌ డే అఖిల్ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. అయితే అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడిన సమంత.. విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 

కాగా.. గతేడాది అఖిల్‌ ఏజెంట్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. 

Advertisement
 
Advertisement
Advertisement