తెలుగమ్మాయి క్రేజ్.. బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న అనన్య నాగళ్ల! | Tollywood Actress Ananya Nagalla Ready To Debut In Bollywood Cinema | Sakshi
Sakshi News home page

Ananya Nagalla: తెలుగులో మాత్రమే కాదు.. బాలీవుడ్‌లో ఎంట‍్రీ ఇస్తోన్న అనన్య నాగళ్ల!

Apr 6 2025 9:28 PM | Updated on Apr 6 2025 9:28 PM

Tollywood Actress  Ananya Nagalla Ready To Debut In Bollywood Cinema

తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలని తక్కువ చేసి చూస్తారు. ముఖ్యంగా తెలుగమ్మాయిలకు హీరోయిన్ ఛాన్సులు ఇవ్వరనే భావన చాలా మందిలో ఉంది. కానీ హార్డ్ వర్క్, డెడికేషన్ ఉంటే కచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని కొంతమంది తెలుగమ్మాయిలు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్లలో అనన్య నాగళ్ల ముందు వరుసలో ఉంటారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినా అనన్య.. కెరీర్ ప్రారంభంలో 'షాదీ' వంటి షార్ట్ ఫిల్మ్ లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత 'మల్లేశం' మూవీతో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. ఆ సినిమాలో చక్కని కట్టు బొట్టుతో కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. వెంటనే 'ప్లే బ్యాక్' అనే సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రలో నటించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. అనంతరం  'తంత్ర' 'పొట్టేల్' 'బహిష్కరణ'(వెబ్ సిరీస్) ' శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అనన్య   స్మాల్ స్కేల్ వుమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. అనన్యతో రూ.5 కోట్ల బడ్జెట్లో లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అవి ఈజీగా మార్కెట్ అవుతున్నాయి. 'తంత్ర' 'పొట్టేల్' 'బహిష్కరణ' 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' వంటివి ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ముఖ్యంగా 'తంత్ర' హిందీ వెర్షన్ జియో హాట్ స్టార్‌లో టాప్ -2 లో ట్రెండ్ అవుతుండగా.. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశ వ్యాప్తంగా ఇప్పటికీ టాప్- 5లో ట్రెండింగ్‌లో ఉంది. ఇకపై దర్శకనిర్మాతలు రూ.5 కోట్ల బడ్జెట్లో తీసే లేడి ఓరియంటెడ్ సినిమాలకు అనన్య నాగళ్ల బెస్ట్ ఆప్షన్ భావిస్తున్నారు. తెలుగమ్మాయి అనన్య ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు. ఆమె మెయిన్ రోల్‌లో ఒక హిందీ ప్రాజెక్టు కూడా రూపొందుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement