భారీ యాక్షన్‌ సీన్స్‌తో 'సింగం ఎగైన్‌' ట్రైలర్‌ | Singham Again Singham Again Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

భారీ యాక్షన్‌ సీన్స్‌తో 'సింగం ఎగైన్‌' ట్రైలర్‌

Oct 7 2024 2:54 PM | Updated on Oct 7 2024 3:28 PM

Singham Again Singham Again Official Trailer Out Now

బాలీవుడ్‌లో అజయ్‌ దేవగణ్‌, దీపిక పదుకొణె నటించిన 'సింగం అగైన్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో ఉన్న ట్రైలర్‌ను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన భారీ తారాగణమే ఉంది. ఇప్పటికే విడుదలైన 'సింగం' ఫ్రాంఛైజీలోని చిత్రాలను ప్రేక్షకులు భారీగానే ఆదరించారు.

కాప్‌ యూనివర్స్ సినిమాగా రోహిత్‌ శెట్టి తెరకెక్కించారు. ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌, జాకీ ష్రాఫ్, టైగర్‌ ష్రాఫ్‌, కరీనా కపూర్‌ వంటి స్టార్స్‌ నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 4.58 నిమిషాల నిడివితో ఉన్న ట్రైలర్‌ మెప్పించేలా ఉంది. దీపావళి సందర్భంగా నవంబర్‌ 1న ఈ చిత్రం విడుదల కానుంది 

Advertisement
 
Advertisement
Advertisement