Singer Sunitha Shares Her Farming Video Goes Viral - Sakshi
Sakshi News home page

Singer Sunitha: అరటి తోటలో సింగర్‌ సునీత హంగామా.. వీడియో వైరల్‌

Jan 3 2022 7:50 PM | Updated on Jan 3 2022 8:04 PM

Singer Sunitha Shares Her Farming Video, Goes Viral - Sakshi

Singer Sunitha Shares Her Farming Video, Goes Viral: టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఏకైక సింగర్‌ సునీత. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక గతేడాది రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని హెడ్‌లైన్స్‌లో నిలిచిన సునీత పెళ్లి తర్వాత సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌గా కనిపిస్తున్నారు.

సాధారణంగానే ప్రకృతి ప్రేమికురాలైన ఆమె ఈ మధ్యకాలంలో నేచర్‌కి సంబంధించిన పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఓ అరటి తోటకు వెళ్లిన సునీత అక్కడ అరటి గెలను స్వయంగా కోసి తన ఆనందాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.  ‘జాయ్‌ ఆఫ్‌ ఫార్మింగ్‌’అంటూ దానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement