రెండోసారి తండ్రి అయిన ప్రముఖ సింగర్‌.. పోస్ట్ వైరల్‌ | Singer Ed Sheeran Announces The Birth Of Second Daughter Post Viral | Sakshi
Sakshi News home page

రెండోసారి తండ్రి అయిన ప్రముఖ సింగర్‌.. పోస్ట్ వైరల్‌

Published Fri, May 20 2022 9:14 PM | Last Updated on Sat, May 21 2022 8:00 AM

Singer Ed Sheeran Announces The Birth Of Second Daughter Post Viral - Sakshi

Singer Ed Sheeran Announces The Birth Of Second Daughter Post Viral: బ్రిటిష్‌ సింగర్‌, పాటల రచయిత ఎడ్‌ షీరాన్‌ రెండోసారి తండ్రి అయ్యాడు. ఎడ్‌, తన భార్య చెర్రీ సీబోర్న్‌ వారి రెండో కుమార్తెకు ఆహ్వానం పలికారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ షేర్ చేశాడు. 'మాకు మరో అందమైన ఆడపిల్ల పుట్టిందని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. మేమిద్దరం ఆమెను ఎంతో ప్రేమిస్తున్నాం.' అని రాస్తూ ఒక చిన్ని సాక్స్‌ జత పిక్‌ను పోస్ట్‌ చేశాడు ఎడ్‌. అలాగే తన కుమార్తె పుట్టుక తన జీవితానికి కొత్త అర్థాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. 

ఈ పోస్ట్‌పై సింగర్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌ అవుతుంది.  తనకు 11 ఏళ్ల నుంచి పరిచయం ఉన్న సీబోర్న్‌ను ఎడ్‌ షీరాన్‌ 2019లో వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2020 ఆగస్టులో మొదటి కుమార్తె లైరా అంటార్కిటికా జన్మించింది. 31 ఏళ్ల ఎడ్‌ గత పదేళ్లలో అత్యంత పాపులర్‌ అయిన సింగర్‌. ఎడ్‌ మొదటిసారిగా 2011లో తన తొలి సింగిల్‌ 'ది ఏ టీమ్‌'తో అరగేంట్రం చేశాడు. 'షేఫ్‌ ఆఫ్‌ యూ' అనే సాంగ్‌ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

చదవండి: విజయ్‌ దేవరకొండతో రొమాంటిక్ మూవీ చేయాలనుంది: హీరోయిన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement