ప్రేయ‌సితో న‌టుడి నిశ్చితార్థం, పెళ్లి ఎప్పుడంటే.. | Shaheer Sheikh Engaged To Ruchikaa Kapoor | Sakshi
Sakshi News home page

నీతో జీవితం పంచుకునేందుకు ఎగ్జైట్ అవుతున్నా..

Nov 24 2020 6:18 PM | Updated on Nov 24 2020 6:35 PM

Shaheer Sheikh Engaged To Ruchikaa Kapoor - Sakshi

బుల్లితెర న‌టుడు, 'యే రిష్తా హై ప్యార్ కే' సీరియ‌ల్ హీరో షాహీర్ షైఖ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రేయ‌సి రుచికా క‌పూర్‌తో నిశ్చితార్థం కూడా జ‌రుపుకున్నాడు. ఈ శుభ‌వార్త‌ను సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌కు తెలిపాడు. నెచ్చెలి చేయందుకున్న ఫొటోను సైతం షేర్ చేశాడు. నీతో జీవితం పంచుకునే త‌దుప‌రి మ‌జిలీ కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నాను అని రాసుకొచ్చాడు. అటు రుచికా ప‌రిస్థితి కూడా ఇంచుమించు అలాగే క‌నిపిస్తోంది. (చ‌ద‌వండి: ఢిల్లీ క్రైమ్‌ చిత్రానికి అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు)

షాహీరో షేర్ చేసిన ఫొటోలో రుచికా ఎడ‌మ చేతి వేలికి ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగి ఉండగా, కోరుకున్న‌వాడితో జీవితం పంచుకోబోతున్నందుకు సంతోషంలో తేలియాడుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. కాగా ఏడాదిన్న‌ర‌కు పైగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇప్పుడు ఏడ‌డుగులు న‌డ‌వ‌‌నుండ‌టంతో వారి అభిమానులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ నెల‌లోనే సాదాసీదాగా పెళ్లి తంతు కానిచ్చేయ‌నున్న ఈ జంట‌ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మాత్రం సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా అంద‌రి స‌మ‌క్షంలో ఘ‌నంగా వివాహం జ‌రుపుకోనున్నారు. (చ‌ద‌వండి: నా ప్రేమ వందనాలు స్వీకరించు ప్రియా)

Advertisement
 
Advertisement
Advertisement