బెస్ట్ ఫ్రెండ్‌ ఇంట్లో సమంత.. చాలా రోజుల తర్వాత! | Samantha Ruth Prabhu Visits Best Friend Chinmayi Home During Navaratri, Photo Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Samantha-Chinmayi: బెస్ట్ ఫ్రెండ్‌ ఇంటికెళ్లిన సమంత.. సోషల్ మీడియాలో పోస్ట్‌!

Oct 9 2024 12:47 PM | Updated on Oct 9 2024 1:03 PM

Samantha Ruth Prabhu visits best friend Chinmayi home during Navaratri

సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మంత్రి కొండా సురేఖ కామెంట్స్ తర్వాత మరింత సామ్ ఒక్కసారిగా మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌కొచ్చిన సమంత జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసింది. ప్రస్తుతం సినిమాలేవీ లేకపోవడంతో ఆధ్యాత్మిక బాట పట్టింది సామ్. అందులో భాగంగానే ఇటీవల కొయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేసింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న సమంత.. తన క్లోజ్ ఫ్రెండ్ చిన్మయి శ్రీపాదను కలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా సమంత నవరాత్రి పూజల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సమంతతో కలిసి పూజలు చేసిన పిక్‌ను చిన్మయి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఇందులో సమంత తన చేతిలో శారీ పట్టుకుని కనిపించింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. సమంత చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఇండియన్ వర్షన్ సిటాడెల్‌లో కనిపించనుంది. ఆ తర్వాత బంగారం అనే మూవీలో నటించనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement