రామ్‌ 'స్కంద' ట్రైలర్‌ విడుదల.. బోయపాటి మాస్ మార్క్ | Ram Pothineni Skanda Trailer Released | Sakshi
Sakshi News home page

Skanda Trailer: రామ్‌ 'స్కంద' ట్రైలర్‌ విడుదల.. బోయపాటి మాస్ మార్క్

Aug 27 2023 7:35 AM | Updated on Aug 28 2023 1:41 PM

Ram Pothineni Skanda Trailer Released - Sakshi

రామ్ పోతినేని- శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'స్కంద'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో రామ్‌ చెప్పే పంచ్‌ డైలాగ్‌లు 'ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తొయ్యాలే.. అడ్డమొస్తే లేపాలే' వంటివి  బాగా పేలాయని చెప్పవచ్చు.

రామ్‌పై బోయపాటి శ్రీను చిత్రీకరించిన యాక్షన్‌ సీక్వెన్స్‌లు మెప్పిస్తాయి. రామ్‌ను పక్కా మాస్‌ లుక్‌లో బోయపాటి చూపించాడు. ఇందులోని యాక్షన్‌ సీన్స్‌ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇందులో రామ్‌ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు.  పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన స్కంద సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement