సాచి హిట్‌ కావాలి | Prabhas launched sanchi movie trailer | Sakshi
Sakshi News home page

సాచి హిట్‌ కావాలి

Feb 23 2023 2:24 AM | Updated on Feb 23 2023 2:24 AM

Prabhas launched sanchi movie trailer - Sakshi

‘‘సాచి’ సినిమా ట్రైలర్‌ బాగుంది. మహిళా సాధికారతకు సంబంధించిన చిత్రం ఇది. ఇలాంటి మంచి సినిమా హిట్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అని హీరో ప్రభాస్‌ అన్నారు. సంజన రెడ్డి, గీతిక రధన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సాచి’. సత్యానంద్‌ సమర్పణలో వివేక్‌ పోతగోని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా మార్చి 3న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రభాస్‌ విడుదల చేశారు.

 వివేక్‌ పోతగోని మాట్లాడుతూ– ‘‘బిందు అనే ఒక నాయీబ్రాహ్మణ అమ్మాయి నిజ జీవిత గాథ ఇది. తెలంగాణ నాయీబ్రాహ్మణ అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్‌గారు మా చిత్రం ప్రివ్యూ చూసి, బాగుందని అభినందించారు. ఈ చిత్రం అన్ని వర్గాల వారికి నచ్చుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కేవీ భరద్వాజ్, నిర్మాణ సారధ్యం: ఉపేన్‌ నడిపల్లి, వివేక్‌ పోతగోని. 
 

Advertisement
 
Advertisement
Advertisement