స్టార్‌ హీరోతో నిత్యామీనన్‌ పెళ్లి.! | Buzz: Actress Nithya Menen Going To Marry Her Childhood Friend Malayalam Star Hero, Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

Nithya Menen Marriage Rumours: స్టార్‌ హీరోతో నిత్యామీనన్‌ పెళ్లి.!

Published Wed, Aug 23 2023 9:54 AM

 Nithya Menen Marriage News Again Viral - Sakshi

బాలనటిగానే సినీ రంగప్రవేశం చేసిన నిత్యామీనన్‌ హీరోయిన్‌గా మాత్రం 2006లో కథానాయకిగా కన్నడ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా నిత్యామీనన్‌కు మంచి గుర్తింపు ఉంది. చిత్రపరిశ్రమలో హీరోయిన్‌గా మాత్రమే కాకుండా సింగర్‌గా కూడా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. కానీ ఇప్పుడు ఆమెకు అంతగా సినిమా అవకాశాలు లేవనే చెప్పవచ్చు. దీంతో ఇక పెళ్లి చేసుకోమని తన కుటుంబ సభ్యులు తెలుపుతున్నారట.  

(ఇదీ చదవండి; బిగ్‌ బాస్‌లోకి ఆ స్టార్‌ హీరో, హీరోయిన్‌.. ఆఖరి క్షణంలో అదిరిపోయే ట్విస్ట్‌)

అంతేకాకుండా తనకు 35 ఏళ్లు వచ్చాయని ఇక పెళ్లి చేసుకోవడం మంచిదని వారు సలహా ఇచ్చారట. దీంతో ఆమె తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఓ మలయాళ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుందని శాండిల్‌వుడ్‌లో ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా నిత్యామీనన్‌ పెళ్లి విషయంపై చాలా వార్తలే వచ్చాయి. కానీ వాటిని ఆమె వెంటనే కొట్టిపారేసేది కూడా.  కానీ ఈసారి మలయాళీ ఇండస్ట్రీలో మాత్రం నిత్యామీనన్ పెళ్లి వార్త బాగానే వైరల్‌ అవుతుంది. అంతే కాకుండా అక్కడి సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఇది నిజమేనని తెలుపుతున్నారట.

(ఇదీ చదవండి: అనుష్కతో హగ్స్‌.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నవీన్‌)

ఆమె పెళ్లి మాత్రం ప్రముఖ హీరోతోనే జరుగుతుందంటూనే పేరు మాత్రం వారు రివీల్‌ చేయడం లేదట. గతంలో తన పెళ్లి విషయంపై ఎక్కడైనా చిన్న కామెంట్‌ వచ్చినా వెంటనే రియాక్ట్‌ అయ్యే నిత్యా ఈసారి ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో తన పెళ్లి వార్త నిజమేనని, త్వరలో ఆమె అధికారికంగా ప్రకటిస్తారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా నిత్యామీనన్ పెళ్లి వార్త  సోషల్ మీడియాలో మరోసారి భారీగా ట్రెండ్‌ అవుతుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement