‘నాటు’పాటకి చిరంజీవి, బాలకృష్ణ స్టెప్పులేస్తే.. : ఎన్టీఆర్‌ | Jr NTR Says Naatu Naatu Is An Ode To Chiranjeevi And Balakrishna | Sakshi
Sakshi News home page

‘నాటు నాటు’ పాటకి చిరంజీవి, బాలకృష్ణ డ్యాన్స్‌ చేస్తే.. : ఎన్టీఆర్‌

May 13 2025 10:46 AM | Updated on May 13 2025 11:07 AM

Jr NTR Says Naatu Naatu Is An Ode To Chiranjeevi And Balakrishna

ఎన్టీఆర్(Jr NTR), రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం.. రణం.. రుధిరం)(RRR). ఆలియాభట్, ఒలీవియా మోరిస్, అజయ్‌ దేవగన్‌ , రే స్టీవెన్‌ సన్‌ , అలిసన్‌ డూడీ ఇతర  పాత్రల్లో నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2022 మార్చి 25న విడుదలైంది. తాజాగా లండన్‌ లోని ప్రతిష్టాత్మక రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా స్క్రీనింగ్‌తో పాటు కీరవాణి లైవ్‌ కాన్సెర్ట్‌ జరిగింది. 

ఈ వేడుకకు అశాంతి ఓంకార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ–‘‘నాటు నాటు’ పాటలో నా మిత్రుడు, అద్భుతమైన డ్యాన్సర్‌ రామ్‌చరణ్‌తో కలిసి డ్యాన్స్‌ చేయడాన్ని మర్చిపోలేను. చిరంజీవిగారు గ్రేట్‌ డ్యాన్సర్‌. మా బాబాయ్‌ బాలకృష్ణ కూడా మంచి డ్యాన్సర్‌. చిరంజీవిగారు(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna) బాబాయ్‌ కలిసి ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్‌ చేస్తే అది మంచి జ్ఞాపకంగా నిలిచిపోతుంది’’ అన్నారు. 

ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్, రాజమౌళి, కీరవాణి పాల్గొన్నారు. ఇక ఈ వేడుకకు మహేశ్‌బాబు హాజరవుతారనే ప్రచారం సాగినప్పటికీ ఆయన పాల్గొనలేదు. ఇక 2023 మార్చిలో జరిగిన 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి, లిరిక్‌ రైటర్‌ చంద్ర బోస్‌లకు ఆస్కార్‌ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ సినిమా 2019లో రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో స్క్రీనింగ్‌ జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement