Jacqueline Fernandez: జాక్వెలిన్‌ను సుకేష్‌ ఇలా ముగ్గులోకి దింపాడట..

Jacqueline Fernandez Interesting News About Sukesh - Sakshi

Jacqueline Fernandez Interesting News About Sukesh: శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ సుకేష్‌ చంద్రశేఖర్‌ మనీలాండరింగ్‌ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుకేష్‌ బాలీవుడ్‌ హీరోయిన్స్‌ జాక్వెలిన్‌, నోరాకు ఖరీదైన బహుమతులు ఇవ్వడంతో వార్తల్లో ప్రధానంశంగా మారింది. అయితే జాక్వెలిన్‌ను సుకేష్‌ ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నాలు, పలికిన ప్రగల్బాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. జాక్వెలిన్‌ కోసం వరుస సినిమాలను నిర్మిస్తానని సుకేష్‌ మాట చెప్పాడట. విలాసవంతమైన బహుమతులు ఇచ్చిన సుకేష్‌ తనకు కేంద్ర ప్రభుత్వంలో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. 

జాక్వెలిన్‌తో స్నేహం కోసం సుకేష్‌ పొగడ్తలతో ముంచెత్తాడని ప్రచారం జరుగుతోంది. జాక్వెలిన్ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీలా ఉంటుందని, తనకన్న నువ్వేం తక్కువా కాదని ఆకాశానికెత్తాడట సుకేష్‌. అంతేకాకుండా రూ. 500 కోట్లతో 3 భాగాలతో మహిళా సూపర్‌ హీరో ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తానని నమ్మబలికాడట. ఇండియాలో ఇదే హీరోయిన్ ఒరియెంటెడ్ సూపర్ హీరో సినిమా అవుతుందని స్వీట్‌గా మాయమాటలు చెప్పాడని పుకార్లు వినిపిస్తున్నాయి. సూపర్‌ హీరో కథలతో హాలీవుడ్‌ గ్రాఫిక్స్‌ నిపుణులతో సినిమా నిర్మిస్తున్నానని మాట కూడా ఇచ్చాడట సుకేష్‌. జాక్వెలిన్‌ను ముగ్గులోకి దింపడానికి సుకేష్‌ సినిమా బడ్జెట్‌, ప్రొడక్షన్‌ పనులపై కొంచెం పరిశోధన చేసాడని సమాచారం. 

ఇదీ చదవండి: 2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్‌ తారలు వీరే..

అయితే బాలీవుడ్‌లో సాంగ్స్‌ మినహా పెద్దగా సినిమా అవకాశాలు లేని జాక్వెలిన్‌ సుకేష్‌ స్వీట్‌ మాటలకు పడిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపినట్లు సమాచారం. తనకు సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ 2015 నుంచి తెలుసని, ఆమెకు ఎన్‌సీబీ కేసులో సహాయం చేసినట్లు సుకేష్‌ ఈడీ విచారణలో పేర్కొన్నట‍్లు తెలుస్తోంది. వ్యాపార వేత్త రాజ్ కుంద్రాకు అశ్లీల చిత్రాల కేసులో బయటకు రావడానికి కూడా హెల్ప్‌ చేసినట్లు తెలిపాడట. 

ఇదీ చదవండి: ఐశ్వర్య రాయ్‌కు ఈడీ సమన‍్లు.. ఎందుకంటే ?
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top