కిరణ్, దేవికా భట్
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ, కథ–స్క్రీన్ ప్లే అందించడంతో పాటు స్వీయ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రియాలిటీ’. ఈ చిత్రంలో దేవికా భట్ హీరోయిన్గా నటిస్తుండగా, శరత్ కుమార్, సాయి కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
జాయ్ ఫిల్మ్స్ పతాకంపై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేష్ ఎర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని ఆలోచన పాత్రలో దేవికా భట్ నటిస్తున్నట్లు వెల్లడించి, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. డిసెంబరు 25న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో.


