‘మీ అమ్మకు అలా మెసేజ్‌ చేస్తే ఓకేనా?’.. నెటిజన్‌పై శ్వేతవర్మ ఫైర్‌ | Bigg Boss Fame Shweta Verma Fires On Netizen Who Sends Indecent Messages | Sakshi
Sakshi News home page

‘మీ అమ్మకు అలా మెసేజ్‌ చేస్తే ఓకేనా?’.. నెటిజన్‌పై బిగ్‌బాస్‌ ఫేం శ్వేతవర్మ ఫైర్‌

Apr 25 2024 3:58 PM | Updated on Apr 25 2024 3:58 PM

Bigg Boss Fame Shweta Verma Fires On Netizen Who Sends Indecent Messages - Sakshi

బిగ్‌బాస్‌ రియాల్టీ షో ద్వారా చాలా మంది ఫేమస్‌ అయ్యారు. వారిలో శ్వేతవర్మ కూడా ఒకరు. గతంలో పలు సినిమాల్లో నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ సీజన్‌ 5లో పాల్గొన్న తర్వాత బుల్లితెర ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ ప్రియులందరికి దగ్గరైంది. ఆ షో తర్వాత సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. పలు చిన్న సినిమాల్లో హీరోయిన్‌గాను నటించింది. అయితే అవకాశాలు రాలేకనో లేదా పాత్రలు నచ్చకపోవడంతో తెలియదు కానీ  కొన్నాళ్లుగా శ్వేత వర్మ సినిమాలకు దూరంగా ఉంటుంది.

 సోషల్‌ మీడియా ద్వార మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. తన పర్సనల్‌ విషయాలను సైతం ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకునే శ్వేతకు సోషల్‌ మీడియాలో ఛేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆమెకు అసభ్యకర సందేశాలను పంపిస్తూ వేధిస్తున్నాడు. ఆమె ఫ్రైవేట్‌ భాగాలపై నీచంగా కామెంట్‌ చేశాడు. తాజాగా సదరు వ్యక్తి పంపిన సందేశాలతో పాటు అతని ప్రొఫైల్‌ని స్క్రీన్‌ షాట్స్‌ తీసి ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది.

‘ఒక మనిషికి ఇలాంటి మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది? అతని అమ్మకు కూడా ఎవరైనా ఇలా చెబితే ఊరుకుంటాడా? ఇప్పటికీ ఇలాంటి వాళ్లు ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను’అంటూ శ్వేత రాసుకొచ్చింది. అలాగే అతని అడ్రస్‌, కాంటాక్ట్‌ కూడా సంపాదించానని, ఆ వివరాలు కూడా ఇన్‌స్టాలో పెట్టొచ్చు..కానీ మనిషిని కాబట్టి షేర్‌ చేయలేకపోతున్నానని చెప్పింది. ఇది అతనికొక గుణపాఠమని, ఇకనైనా ఇలాంటి పనులు చేయకుండా ఉంటే మంచిదంటూ శ్వేత ఓ వీడియోని షేర్‌ చేసింది.శ్వేత వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement