బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌కు చేదు అనుభవం.. చితకబాదిన ప్రయాణికుడు! | Big Boss OTT fame Puneet Superstar beaten by a Passenger In Flight | Sakshi
Sakshi News home page

Big Boss Contestant: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌కు చేదు అనుభవం.. చితకబాదిన ప్రయాణికుడు!

Dec 19 2024 3:04 PM | Updated on Dec 19 2024 3:15 PM

Big Boss OTT fame Puneet Superstar beaten by a Passenger In Flight

ప్రముఖ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫ్లైట్‌ నుంచి దిగి వస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. ఉన్నట్టుండి అతన్ని చితక్కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాలీవుడ్ బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు పునీత్ సూపర్ స్టార్(అసలు పేరు ప్రకాష్ కుమార్). తాజాగా అతన్ని ఓ విమాన ప్రయాణికుడు చితకబాదాడు. అసలేం జరిగిందో తెలియదు కానీ పునీత్‌ చితక్కొడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

గతంలో కూడా పునీత్ సూపర్‌స్టార్‌తో సోషల్ మీడియా ఇన్‌ప్లూయన్సర్‌ ప్రదీప్ కూడా గొడవపడ్డారు. ఆ సమయంలో పునీత్‌ను చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా మరోసారి అదే ఘటన పునరావృతమైంది. అయితే ఇలాంటివి అతను కావాలనే చేస్తున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement