వచ్చే ఉగాదికి స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేస్తా | Actor Vishal Speech At Chakra Pre Release Event | Sakshi
Sakshi News home page

వచ్చే ఉగాదికి స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేస్తా

Feb 15 2021 1:11 AM | Updated on Feb 15 2021 1:11 AM

Actor Vishal Speech At Chakra Pre Release Event - Sakshi

రమణ, విశాల్, ఆనందన్‌

‘‘స్ట్రయిట్‌ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు అని చాలా మంది అడుగుతున్నారు.. తప్పకుండా వచ్చే ఏడాది  ఉగాదికి నా స్ట్రయిట్‌ తెలుగు సినిమా విడుదలవుతుంది’’ అన్నారు హీరో విశాల్‌. ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో విశాల్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘విశాల్‌ చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రెజీనా కసాండ్ర ముఖ్య పాత్రలో నటించారు. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదారాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో విశాల్‌ మాట్లాడుతూ– ‘‘డిజిటల్‌ క్రైమ్స్‌ నేపథ్యంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ఎంఎస్‌ ఆనందన్‌ ఎంతో హార్డ్‌ వర్క్‌ చేసి ఈ సినిమా తీశారు.

నా తమ్ముడు యువన్‌ శంకర్‌ రాజా మంచి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చాడు. నా తమ్ముడు వరంగల్‌ శ్రీను సహా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌ అందరూ ‘విశాల్‌ చక్ర’ తో తప్పకుండా జాక్‌ పాట్‌ కొడతారు’’ అన్నారు. ఎంఎస్‌ ఆనందన్‌ మాట్లాడుతూ– ‘‘ఎక్కడో ఉన్న నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది విశాల్‌గారే. ఈ సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకూ ప్రతి సీక్వెన్స్‌ చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. నాకు తెలుగు సినిమా అన్నా, తెలుగు భాష అన్నా చాలా ఇష్టం.. సినిమాలు చూసే తెలుగు నేర్చుకున్నాను. దర్శకుడు రాజమౌళిగారు అరంటే చాలా ఇష్టం ’’అన్నారు. ‘మిస్‌ ఇండియా’ దర్శకుడు నరేంద్రనాథ్, పవన్‌తేజ్‌ కొణిదెల, మేఘన, నైజాం డిస్ట్రిబ్యూటర్‌ వరంగల్‌ శ్రీను, సీడెడ్‌ డిస్ట్రిబ్యూటర్‌ శోభన్‌ తరుపున నరసింహసాయి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రమనియం.

Advertisement
 
Advertisement
Advertisement