ఖలీద్‌ మహ్మద్‌ పిటిషన్‌ కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు  | US Supreme Court rejects effort to revive Khalid Sheikh Mohammed plea | Sakshi
Sakshi News home page

ఖలీద్‌ మహ్మద్‌ పిటిషన్‌ కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు 

Oct 20 2026 6:14 AM | Updated on Oct 20 2026 6:14 AM

US Supreme Court rejects effort to revive Khalid Sheikh Mohammed plea

వాషింగ్టన్‌: 2001 సెప్టెంబర్‌ 11వ తేదీనాటి దాడి ప్రధాన సూత్రధారి ఖలీద్‌ షేక్‌ మహ్మద్‌ పెట్టుకున్న ప్లీ బార్గెయిన్‌ (నేరాన్ని అంగీకరించి శిక్షను తక్కువ చేసుకునే ఒప్పందం) పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ఒప్పందానికి కోర్టు అంగీకారం తెలిపిన పక్షంలో ఖలీద్‌ షేక్‌ మహ్మద్‌ తన నేరాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. దాని ప్రకారం మరణశిక్ష ముప్పు తప్పడంతోపాటు అతడికి ఎటువంటి పెరోల్‌లేని జీవిత ఖైదు పడుతుంది. దాదాపు 25 ఏళ్ల క్రితం వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్, పెంటగాన్‌లను హైజాక్‌ చేసిన విమానాలతో కూల్చేయాలంటూ మహ్మద్‌ కుట్ర పన్ని అమలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

క్యూబా సమీపంలోని గ్వాంటానమో బేలో అతడిని ఉంచారు. పెంటగాన్‌ సీనియర్‌ అధికారి, సైనిక ప్రాసిక్యూటర్లు ప్లీ బార్గెయిన్‌ ఒప్పందాన్ని ఆమోదించారు. అయితే, ఒప్పందాన్ని అప్పటి రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ జోక్యం చేసుకుని రద్దు చేశారు. 9/11 వంటి తీవ్రమైన ఘటనల్లో మరణశిక్షపై కేవలం రక్షణ మంత్రి మాత్రమే తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అప్పీల్‌ కోర్టు కూడా ఆస్టిన్‌ తన పరిధిలోనే వ్యవహరించినట్లు ధ్రువీకరించింది. సుప్రీంకోర్టులో ఈ కేసు తదుపరి విచారణ 2028లో జరగనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement