Elon Musk's SpaceX Hires New 14-Year-Old Software Engineer - Sakshi
Sakshi News home page

స్పేస్‌ ఎక్స్‌లో పద్నాలుగేళ్ల ఇంజనీర్‌

Jun 12 2023 8:34 AM | Updated on Jun 12 2023 11:27 AM

Elon Musk Spacex Hires New 14 Year Old Software Engineer - Sakshi

కాలిఫోర్నియా: ఎలన్‌ మస్క్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌కి ఇకపై ఒక బుల్లి ఇంజనీర్‌ సేవలందించనున్నాడు. 14 ఏళ్ల వయసున్న కైరాన్‌ క్వాజి అనే ఇంజనీర్‌కి ఉద్యోగమిచ్చింది. స్పేస్‌ ఎక్స్‌ నిర్వహించిన సాంకేతిక పరీక్ష, ఇంటర్వ్యూల్లో క్వాజీ ఉత్తీర్ణుడు కావడంతో ఇంజనీర్‌గా నియమించినట్టు సంస్థ వెల్లడించింది. పదకొండేళ్లకే క్వాజీ ఇంజనీరింగ్‌లో చేరాడు.

కంప్యూటర్‌ సైన్స్‌లో పట్టా తీసుకున్న క్వాజీకి వెంటనే స్పేస్‌ ఎక్స్‌లో ఉద్యోగం లభించింది. అంగారక గ్రహంపైకి మనుషుల్ని తీసుకువెళ్లే ప్రాజెక్టులో క్వాజీ ఉన్నాడు.  

చదవండి: ఎవరెస్ట్‌ యమ డేంజర్.. పది వేల అడుగులు దాటితే..

Advertisement
 
Advertisement
Advertisement