ఎప్పటికై నా గొప్ప నటి అవుతా.. | - | Sakshi
Sakshi News home page

ఎప్పటికై నా గొప్ప నటి అవుతా..

Apr 24 2026 8:08 AM | Updated on Apr 24 2026 8:08 AM

‘ఫెమీనా మిస్‌ ఇండియా సౌత్‌ 2026’ ఇందు ఫాల్గుణి

పంజగుట్ట: గొప్ప నటి కావాలన్నదే తన ఆశయమని, ఎప్పటికై నా అనుష్కా షెట్టి అంతటి గొప్ప నటిని అవుతానని ‘ఫెమీనా మిస్‌ ఇండియా సౌత్‌ 2026’ టైటిల్‌ కై వసం చేసుకున్న చిలకలపూడి ఇందు ఫల్గుణి తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మిస్‌ ఇండియా పోటీల విశేషాలు వెల్లడించారు. ఏప్రిల్‌ 18న జరిగిన పోటీల్లో ‘ఫెమీనా మిస్‌ ఇండియా సౌత్‌ 2026’ విజేతగా తెలుగు రాష్ట్రాల నుండి మొట్టమొదటి సారి తాను నిలిచానన్నారు. సుష్మితాసేన్‌, ఐశ్వర్యారాయ్‌, లారాదత్త ఆదర్శమని, ఎప్పటికై నా ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నటి అనుష్కా షెట్టి అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె అంతటి నటి అవుతానని తెలిపారు. గుంటూరుకు చెందిన ఇందు ఫల్గుణి నగరంలో శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటూ ఎల్‌ఎల్‌బీ చదువుతోంది. మేజిస్ట్రేట్‌ కావాలన్నది తన కోరిక అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement