మంచి చేసే వారిని ఎన్నుకోవాలి | Sakshi
Sakshi News home page

మంచి చేసే వారిని ఎన్నుకోవాలి

Published Mon, Apr 8 2024 1:45 AM

ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న 
ఎంపీ సురేష్‌, అసెంబ్లీ అభ్యర్థి చిన హనిమిరెడ్డి     - Sakshi

జే పంగులూరు: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలించిన ఐదేళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించామని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, అద్దంకి అసెంబ్లీ అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కొండమంజులూరులో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ జగనన్న నాయకత్వంలో ఐదేళ్ల వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ పాలనను, అంతకు ముందు చంద్రబాబు పాలనను బేరీజు వేసుకుని ఎవరి వల్ల మంచి జరగిందో ఆలోచించాలన్నారు. ఏ ప్రభుత్వ హయాంలో మీ కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయో గమనించాలని చెప్పారు. మంచి చేసే మనసున్న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందంటే ఆయనకు ఓటేసి మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

కూటమి నేతల కుట్రలతోనే ఇబ్బందులు..

లబ్ధిదారులు ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు అని విమర్శించారు. పేదలకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా చేస్తున్న మేలును చూసి ఓర్వలేని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కూటమి నాయకులు కుట్ర పన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారన్నారు. ఇది తాత్కాలికమేనని, మళ్లీ జగనన్న ప్రభుత్వం రాగానే వలంటీర్లు వేకువజామునే ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తారని చెప్పారు. సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగలంటే మళ్లీ వైఎస్‌ జగన్‌ను సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

పెత్తందార్లపై పేదలదే విజయం..

రానున్న ఎన్నికల్లో కూటమి పక్షాన పోటీలో నిలబడిన కోటీశ్వరులైన అయిన పెత్తందార్లపై సీఎం జగనన్న నిలబెట్టిన తనవంటి సామాన్యులదే విజయమని అన్నారు. రానున్న ఎన్నికల యుద్ధంలో జగనన్న పాటిస్తున్న ధర్మమే గెలుస్తుందని, చంద్రబాబు కూటమి సమాధికాక తప్పదని చెప్పారు. చంద్రబాబు నాపై ఎన్ని కేసులు పెట్టినా, ఒక సామాన్య వ్యక్తిని ఎంపీ చేసిన ఘనత మన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని సురేష్‌ అన్నారు. సంక్షేమ పథకాలు అమలు తీరుపై ఆరాతీశారు. పింఛన్‌ అందించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేదని, ప్రతి నెల ఒకటో తేదీ తెల్లవారు జామునే తలుపు తట్టి పింఛన్‌ అందించే వలంటీరుని చంద్రబాబు ఆండ్‌కో అడ్డుకోవడం వలన ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని వృద్ధులు, వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ స్వయంపు హనుమంతురావు, మాజి ఏఎంసీ చైర్మన్‌ జంపాని రవిబాబు, సర్పంచి చొప్పరపు ప్రభాకర్‌ పాల్గొన్నారు.

ఐదేళ్లల్లో ఎన్నో అద్భుతాలు సృష్టించాం

కూటమి మాయమాటలు నమ్మొద్దు

బాపట్ల ఎంపీ సురేష్‌, అద్దంకి

ఎమ్మెల్యే అభ్యర్థి చిన హనిమిరెడ్డి

Advertisement
Advertisement