సంక్షేమ గళం | Sakshi
Sakshi News home page

సంక్షేమ గళం

Published Fri, Nov 24 2023 1:38 AM

చక్కని చేతిరాత రాస్తున్న 
విజయ్‌కుమార్‌ కుమార్తె అమూల్య 
 - Sakshi

u జగనన్న రుణం తీర్చుకోలేం

అట్టలు, కాగితాలు, సీసాలు, ప్లాస్టిక్‌ ఏరుకుని అవి అమ్మి జీవితాన్ని వెళ్లబుచ్చే పేదలం. రోజుకు రెండువందలు సంపాదించుకుని రేషన్‌ బియ్యంతో పిల్లలకు కడుపునిండా తిండి పెడితే చాలు అనుకుని తృప్తి పడ్డాం. పోరంబోకు స్థలంలో చిన్న గుడిసె వేసుకుని జీవించే మాకు సొంతిల్లు అనేది కలలో కూడా జరగని పని అనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాకు ఇళ్లస్థల పట్టా ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు. ఇక నుంచి సొంతింట్లో హాయిగా జీవించనున్నాం. జగనన్న రుణం తీర్చుకోలేం.

– మేకల వెంకటేశ్వరమ్మ, అంకమ్మరావు, అమరావతి

ఉచిత విద్య అద్భుతం

నాపేరు గూడూరి విజయ్‌కుమార్‌, భార్య అనూష. మాది కొత్తసొలస ఎస్సీకాలనీ. మాకు ఇద్దరు సంతానం. కూలి పనులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. బాబు చిన్నవాడు. కుమార్తె అమూల్య స్థానిక ఎంపీపీఎస్‌(ఏఏ)లో నాలుగో తరగతి చదువుతోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న ఉచిత విద్య అద్భుతం. మనబడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు అందంగా మారాయి. అమ్మఒడి పథకం మాకు వరంగా మారింది. కాన్వెంట్‌ విద్యార్థులకు దీటుగా నా కుమార్తె చదువుతోంది. క్యాలీగ్రఫీలో నిష్టాతులైన పాఠశాల హెచ్‌ఎం షేక్‌ జున్ను సాహెబ్‌ చేతిరాత, వేదగణితంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఇంత మంచి విద్య అందిస్తున్న జగనన్నకు థ్యాంక్స్‌.

– గూడూరి విజయ్‌కుమార్‌, కొత్తసొలస ఎస్సీకాలనీ

1/2

2/2

Advertisement
Advertisement