పెళ్లి చూపులు భామ ధరించిన గూలబీ రంగు చీర ఎంతంటే..

Ritu Verma Worn Pink Saree Cost Is  - Sakshi

రితు వర్మకు నటన ఒక ప్యాషన్‌. అందుకే రాశి కన్నా వాసికే విలువ ఇస్తుంది. మంచి పాత్రలతో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్‌ విషయంలో కూడా స్టయిల్‌ కన్నా సౌకర్యానికి ఇంపార్టెన్స్‌ ఇస్తుంది. ఇండస్ట్రీలో పనిచేస్తున్నామంటే మన లుక్‌ను పర్ఫెక్ట్‌గా మెయిన్‌టేన్‌ చేయాల్సిందే! అలాగయితేనే ఇండస్ట్రీలో నెగ్గుకురాగలం అంటోంది రితు వర్మ. ఇక ఆమె కంఫర్ట్‌గా ఫీలయ్యే బ్రాండ్స్‌లో ఓ రెండిటి గురించి..

మద్దిన్‌
మధురిత దత్తా, స్తాంజిన్‌ డాజిస్‌.. బిజినెస్‌ పార్ట్‌నర్సే కాదు మంచి స్నేహితులు కూడా! ఫ్యాషన్‌ పై వారికి ఉన్న అభిరుచి, ఆలోచనలు ఏకమవడంతో ఇద్దరూ కలసి కెరీర్‌ను స్టార్ట్‌ చేశారు. ముంబైలోని ఎన్‌ఐఎఫ్‌టీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేసి, 2012లో తమ ఇద్దరి పేరుతోనే ఫ్యాషన్‌  హౌస్‌ను ప్రారంభించారు. ఎక్కువగా చేనేత కళాకారులు నేసిన ఫ్యాబ్రిక్‌నే ఉపయోగిస్తారు. ప్రకృతి నుంచి ప్రేరణ పొందిన, సంప్రదాయ డిజైన్స్‌లో వీరిది పెట్టింది పేరు. ఈ బ్రాండ్‌ వేర్‌ ధర కాస్త ఎక్కువే. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటుంది.

శీతల్‌ జవేరి జ్యూయెల్స్‌..
నాటి.. ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో శీతల్‌ జవేరి జ్యూయెల్స్‌ ఒకటి. నాణ్యత, నైపుణ్యమే దీని బ్రాండ్‌ వాల్యూ. సంప్రదాయ నగలతోపాటు మోడర్న్‌ డిజైన్స్‌ కూడా ఇక్కడ లభిస్తాయి. ధర క్వాలిటీ, డిజైన్స్‌ పై ఆధారపడి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఈ శీతల్‌ జవేరి జ్యూయెల్స్‌ బ్రాండ్‌ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 

(చదవండి: క్యూట్‌లుక్‌తో కట్టిపడేసే కృతి సనన్‌ ధరించిన గులాబీ రంగు చీర ఎంతంటే..)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top