ఆ ఒక్క మాట లాల్‌ బహదూర్‌ మనసులో గాఢంగా నాటుకుంది... | Lal Bahadur Shastri Childhood Inspirational Story | Sakshi
Sakshi News home page

ఆ ఒక్క మాట లాల్‌ బహదూర్‌ మనసులో గాఢంగా నాటుకుంది...

Oct 24 2026 12:01 PM | Updated on Oct 24 2026 12:37 PM

Lal Bahadur Shastri Childhood Inspirational Story

కిడ్స్‌ స్పెషల్‌

మహనీయుల బాల్యం

లాల్‌ బహదూర్‌ శాస్త్రి బాల్యం ముగల్‌ సరాయ్‌ అనే చిన్న ఊళ్లో సాగింది. అతనికి ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లి రామ్‌ దులారీ ముగ్గురు పిల్లలతో పుట్టింటికి చేరింది. పేదరికం తీవ్రంగా ఉన్నా ఆ ఇంట్లో నీతి, నిజాయితీ మాత్రం తగ్గలేదు.

ఒక రోజు స్కూలు నుండి వస్తున్న లాల్‌ బహదూర్‌ స్నేహితులతో కలిసి దారిలోని మామిడి తోటలోకి వెళ్ళాడు. స్నేహితులు చెట్లు ఎక్కి మామిడి పళ్ళు కోసుకోసాగారు. లాల్‌ బహదూర్‌ మాత్రం చెట్టు కిందే నిలబడ్డాడు, కోయలేదు. ఇంతలో మాలి వచ్చి పట్టుకున్నాడు. లాల్‌ బహదూర్‌నే కాకుండా అందరినీ తిట్టి కొట్టాడు. లాల్‌ బహదూర్‌ ఏడ్చి, ‘మా నాన్న చనిపోయాడు’ అని చెప్పాడు సమర్థనగా. అప్పుడు మాలి మెత్తబడి ఇలా అన్నాడు: ‘నాన్న లేని వాడివి కాబట్టే నువ్వు ఇంకా మంచిగా ప్రవర్తించడం నేర్చుకోవాలి’.

ఆ ఒక్క మాట లాల్‌ బహదూర్‌ మనసులో గాఢంగా నాటుకుంది. ఆ రోజు నుండి చెడు స్నేహం, చెడు పనులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. పేదరికంలో కూడా చెప్పులు లేకుండా మైళ్ల తరబడి నడిచి స్కూలుకు వెళ్ళేవాడు. తర్వాత అదే పిల్లాడు భారత దేశానికి ప్రధానమంత్రి అయ్యి ‘జై జవాన్, జై కిసాన్‌’ అని నినదించాడు.

ఇదీ చదవండి: పిల్లల ఆరోగ్యంపై అతిజాగ్రత్త.. వారి ఎదుగుదలకు అడ్డంకేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement