టీడీపీలో రెండో రోజూ కొనసాగిన మూకుమ్మడి రాజీనామాలు | Sakshi
Sakshi News home page

టీడీపీలో రెండో రోజూ కొనసాగిన మూకుమ్మడి రాజీనామాలు

Published Thu, Mar 28 2024 3:40 AM

తమ రాజీనామా లేఖను చూపుతున్న టీడీపీ అనుబంధ సంఘాల కమిటీ ప్రతినిధులు 
 - Sakshi

అనపర్తి: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బదులు బీజేపీ అభ్యర్థి బరిలో నిలుస్తారన్న ప్రచారంపై టీడీపీ అధిష్టానం స్పందించకపోవడంపై బుధవారం రెండో రోజూ టీడీపీ నియోజకవర్గ అనుబంధ సంఘాలకు చెందిన వివిధ కమిటీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీనికి సంబంధించి బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పెదపూడి మండలం ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ మందపల్లి సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన మొదటి జాబితాలోనే అనపర్తి ఎమ్మెల్యే సీటు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించారని, తదనంతరం పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించారన్న ప్రచారంపై పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని అన్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పార్టీ పొత్తుల్లో భాగంగా రామకృష్ణారెడ్డికి కాకుండా వేరే పార్టీకి టికెట్‌ ఇస్తే ఓటమి ఖాయమన్నారు. టికెట్‌ కేటాయింపు విషయంలో టీడీపీ అధిష్టానం స్పష్టతనివ్వకపోవడంపై నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో గల పార్టీ అనుబంధ సంఘాల కమిటీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

రాజీనామా చేసిన పార్టీ అనుబంధ సంఘాల కమిటీ అధ్యక్షులు

Advertisement
Advertisement