Rekha Jhunjhunwala: రెండు స్టాక్‌ల నుండి రూ. 650 కోట్లు | rekha jhunjhunwala earns rs 650 crore in one month | Sakshi
Sakshi News home page

Rekha Jhunjhunwala: రెండు స్టాక్‌ల నుండి రూ. 650 కోట్లు

Mar 7 2023 9:27 PM | Updated on Mar 7 2023 9:33 PM

rekha jhunjhunwala earns rs 650 crore in one month - Sakshi

ఇండియన్ స్టాక్ మార్కెట్ బిగ్‌ బుల్‌గా పేరొందిన రాకేష్ ఝున్‌జున్‌వాలా భార్య రేఖా ఝున్‌జున్‌వాలా కూడా స్టాక్ మార్కెట్లో చాలా వర్క్ చేస్తోంది. ఆమె మొత్తం ఆస్తులు ఇప్పుడు రూ. 650 కోట్లకు పెరిగాయి. రేఖా సంపద పెరగడానికి ప్రధాన కారణం ఆమె పోర్ట్‌ఫోలియోలో ఉన్న రెండు స్టాక్‌లు భారీగా వృద్ధి చెందటమే.

గత నెలలో రేఖా ఝున్‌జున్‌వాలా మెట్రో బ్రాండ్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ షేర్లలో విపరీతమైన పెరుగుదల నమోదైంది. గత కొన్ని సెషన్లలో దలాల్ స్ట్రీట్ అండ్ గ్లోబల్ మార్కెట్‌లో ట్రెండ్ రివర్సల్ తరువాత లార్జ్ క్యాప్, మిడ్-క్యాప్ స్టాక్‌లు బలమైన పనితీరును కనబరిచాయి.

నిజానికి 2023 ఫిబ్రవరి 2న టైటాన్ కంపెనీ షేరు ధర రూ.2310 నుంచి రూ.2535కి పెరిగింది. ఈ విధంగా కేవలం రెండు వారాల్లోనే ఈ షేర్ ధర రూ.225 మేర పెరిగింది. డిసెంబర్ 2021లో లిస్టింగ్ అయిన తర్వాత, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన రేఖ జున్‌జున్‌వాలా భర్త రాకేష్ జున్‌జున్‌వాలా కంపెనీలో 10,07,53,935 షేర్లు లేదా 17.50 శాతం వాటాను కలిగి ఉన్నారు. 

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరణం తర్వాత, ఈ షేర్లు అతని భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు చేరాయి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో రేఖ 10,07,53,935 షేర్లను కలిగి ఉంది. అదే విధంగా 2022 అక్టోబర్ నుండి డిసెంబర్ త్రైమాసికంలో మెట్రో బ్రాండ్‌లలో 3,91,53,600 షేర్లను కలిగి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement