కెనరా బ్యాంక్‌ గుడ్‌న్యూస్‌: పొదుపు ఖాతాల్లో.. | Canara Bank Ends Minimum Balance Rule on All Savings Accounts | Sakshi
Sakshi News home page

కెనరా బ్యాంక్‌ గుడ్‌న్యూస్‌: పొదుపు ఖాతాల్లో..

Jun 1 2025 6:56 AM | Updated on Jun 1 2025 9:45 AM

Canara Bank Ends Minimum Balance Rule on All Savings Accounts

బెంగళూరు: సేవింగ్స్‌ అకౌంట్‌ ఖాతాదారులకు ప్రభుత్వ రంగ దిగ్గజం కెనరా బ్యాంక్‌ శుభవార్త చెప్పింది. జూన్‌ 1 నుంచి అన్ని రకాల సేవింగ్స్‌ అకౌంట్లకు కనీస నెలవారీ బ్యాలెన్స్‌ (ఏఎంబీ) నిబంధనను పూర్తిగా ఎత్తివేసినట్లు వెల్లడించింది.

సేవింగ్స్‌ అకౌంట్లు, శాలరీ అకౌంట్లు, ఎన్‌ఆర్‌ఐ ఎస్‌బీ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది. దీనితో ఇక ఏ పొదుపు ఖాతా కస్టమరుపైనా కనీస బ్యాలెన్స్‌ పాటించనందుకు ఎలాంటి రుసుములు లేదా పెనాల్టీల భారం ఉండదని బ్యాంకు తెలిపింది. వేతన జీవులు, సీనియర్‌ సిటిజెన్లు, విద్యార్థులు, ఎన్నారైలకు కూడా దీనితో ప్రయోజనం లభిస్తుందని బ్యాంకు ఎండీ కె. సత్యనారాయణ రాజు వివరించారు.  ప్రస్తుతం అకౌంటు రకాన్ని బట్టి నెలవారీగా కనీస బ్యాలెన్స్‌ పాటించాల్సి ఉంటోంది. పాటించకపోతే పెనాల్టీ చార్జీలు కట్టాల్సి ఉంటోంది.

ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

Advertisement
 
Advertisement
Advertisement