లాక్‌డౌన్‌లో హ్యుందాయ్‌ క్రెటా రికార్డు | All new Creta receives over 55,000 bookings: Hyundai     | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌లో హ్యుందాయ్‌ క్రెటా రికార్డు

Jul 29 2020 4:58 PM | Updated on Jul 29 2020 6:03 PM

All new Creta receives over 55,000 bookings: Hyundai     - Sakshi

సాక్షి,ముంబై:  హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్)కు చెందిన ప్రముఖకారు  క్రెటా కొత్త వెర్షన్‌ బుకింగ్‌లలో దూసుకుపోతోంది.  ఈ ఏడాది మార్చిలో లాంచ్‌ చేసిన క్రెటా వెర్షన్‌ కారు  రికార్డు స్థాయి బుకింగ్‌లను  సాధించి మార్కెట్‌ లీడర్‌గా నిలిచింది. క్రెటా కొత్త వెర్షన్‌కు 55 వేల బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.  (హ్యుందాయ్‌ క్రెటా @ రూ. 9.9 లక్షలు)

2020 మే-జూన్ నెలల్లో అత్యధిక అమ్మకాలను సాధించి ఎస్‌యూవీ విభాగంలో టాప్‌లో ఉందని హెచ్‌ఎంఐఎల్  తెలిపింది. 2015 లో ప్రారంభించినప్పటి నుంచి ఇండస్ట్రీలో బెంచ్ మార్క్‌గా నిలిచిందనీ, ఇది 4.85 లక్షలకు పైగా విలువైన కస్టమర్లను సాధించిందని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్) తరుణ్ గార్గ్ చెప్పారు. కొత్త వెర్షన్‌ ద్వారా కంపెనీ మరోసారి ఈ విభాగంలో ఎస్‌యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పిందన్నారు. కేవలం నాలుగు నెలల్లో 55,000 బుకింగ్‌లు, 20,000 మందికి పైగా కస్టమర్లను సాధించిందన్నారు. ఈ కష‍్టకాలంలో కూడా భారతదేశం అంతటా ఆదరణకు నోచుకోవడం తమ ఎస్‌యూవీ  పనితీరుకు నిదర్శనమని గార్గ్  వెల్లడించారు. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ జిడిఐ టర్బో పెట్రోల్ ఇంజన్‌ ఆప్షన్లలో  హ్యుందాయ్‌ క్రెటా 2020 మార్కెట్‌లో అందుబాటులో ఉన‍్న సంగతి తెలిసిందే. (మారుతికి షాక్ : టాప్ సెల్లింగ్ కార్ ఇదే!)

Advertisement
 
Advertisement
Advertisement