ఈ రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు | Today Horoscope Telugu-20-09-2021 | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు

Sep 20 2021 6:21 AM | Updated on Sep 21 2021 6:34 AM

Today Horoscope Telugu-20-09-2021 - Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరిస్‌

శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షఋతువు, భాద్రపద మాసం, తిథి పౌర్ణమి తె.4.50 వరకు (తెల్లవారితే మంగళవారం), తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం పూర్వాభాద్ర తె.4.39 వరకు (తెల్లవారితే మంగళ వారం), తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం ఉ.10.44 నుండి 12.22 వరకు, దుర్ముహూర్తం ప.12.18 నుండి 1.06 వరకు, తదుపరి ప.2.44 నుండి 3.31, వరకు, అమృతఘడియలు...రా.8.32 నుండి 10.09 వరకు

సూర్యోదయం :  5.52
సూర్యాస్తమయం :  5.57
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు 

రాశి ఫలాలు: 

మేషం...  ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల సాయం పొందుతారు. వివాదాల పరిష్కారం. బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృషభం...  పనుల్లో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. విద్యావకాశాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం....  మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం...  శ్రమాధిక్యం. ముఖ్యమైన వ్యవహారాలు నిదానిస్తాయి.పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

సింహం...  సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

కన్య...  రావలసిన సొమ్ము అందుతుంది. శుభవార్తలు వింటారు. వాహనయోగం. మీ నిర్ణయాలు అంతా స్వాగతిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల....  విద్యార్థులకు కొంత నిరుత్సాహం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

వృశ్చికం....  కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

ధనుస్సు....  ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. బాకీలు వసూలవుతాయి. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం....  వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

కుంభం...  శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఒప్పందాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మీనం....  పనులలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement