పచ్చగూండాల దహనకాండ | TDP attacks on the very first day of municipal election nominations | Sakshi
Sakshi News home page

పచ్చగూండాల దహనకాండ

Oct 17 2026 4:32 AM | Updated on Oct 17 2026 4:32 AM

TDP attacks on the very first day of municipal election nominations

రాయచోటిలో దాడిలో దెబ్బతిన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న గడికోట శ్రీకాంత్‌రెడ్డి

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. రాజ్యాంగాన్ని కాలరాశారు.. రాజకీయ కక్షతో చంద్రబాబు రాష్ట్రాన్ని హింసాగ్నిలోకి నెట్టారు. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల తొలి రోజే పచ్చమూకల దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, విధ్వంసకాండతో రాష్ట్రం అట్టుడికింది. పుంగనూరులో సాక్షాత్తూ ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం.. 

రాయచోటిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి నిప్పు.. వాహనాల దగ్థం.. ధర్మవరంలో రాళ్లదాడి.. తిరుపతిలో నామినేషన్‌ పత్రాల చించివేత.. తాడిపత్రిలో బెదిరింపులు.. గుత్తిలో కిడ్నాప్‌! ఒక్కటే దుర్మార్గపు రాజకీయ లక్ష్యంగా వైఎస్సార్‌సీపీని ఎన్నికల బరి నుంచి తప్పించడం! 

ఎక్కడ నామినేషన్‌ వేయడానికి అడుగుపెట్టినా దాడులు.. ఎక్కడ అభ్యర్థి కనిపించినా బెదిరింపులు.. ఎక్కడ ప్రతిపక్షం గొంతెత్తినా దౌర్జన్యాలు! రాళ్లు, కొడవళ్లు, రాడ్లు, కర్రలు, పెట్రోల్‌ బాటిళ్లతో పేట్రేగిన పచ్చమూకలు.. ప్రజాస్వామ్యాన్ని పచ్చస్వామ్యంగా మార్చే కుట్రకు తెగబడ్డాయి! 

ప్రజల తీర్పుతో గెలవాల్సిన ఎన్నికలను గూండాల బలంతో శాసించాలనే దురహంకారం.. ప్రతిపక్ష అభ్యర్థులను భయపెట్టి నామినేషన్లకు దూరం చేయాలనే కక్ష.. పోలీసుల కళ్లముందే సాగిన దాడులు.. చంద్రబాబు పాలనలో ఎన్నికల స్వేచ్ఛపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. 

ఇది రాజకీయ పోరాటం కాదు.. ప్రతిపక్షంపై పచ్చమూకలు సాగిస్తున్న దౌర్జన్యకాండ! ఇది ఎన్నికల ప్రచారం కాదు.. ప్రజాస్వామ్య హక్కులపై సాగుతున్న దాడి! ఇది అధికార దర్పం కాదు.. గూండారాజ్‌ బరితెగింపు! తన పాలనపై నమ్మకం లేకపోవడం.. ప్రజలు ఛీత్కరిస్తారనే భయం.. వెరసి చంద్రబాబు ఈ గూండారాజ్‌కు తెరతీశారు. నారాసుర రక్తచరిత్రకు మళ్లీ నాంది పలికారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement