తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏనుగు బీభత్సం | Elephant Rampage at Tiruchanoor Temple | Sakshi
Sakshi News home page

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏనుగు బీభత్సం

Oct 4 2026 7:07 PM | Updated on Oct 4 2026 7:28 PM

 Elephant Rampage at Tiruchanoor Temple

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఏనుగులు భీభత్సం సృష్టించడంతో మావటి చంద్రారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రతిరోజూ సాయంత్రం అమ్మవారి వాహన మండపంలో ఉంజల్ సేవ నిర్వహిస్తారు. ఆ సమయంలో టీటీడీకి సంబంధించిన ఏనుగులు ఆలయం వద్దకు తీసుకురావడం ఆనవాయతీ. 

ఊంజల్ సేవ పూర్తైన తరువాత ఏనుగులను తిరిగి ఉద్యానవనానికి తీసుకెళుతుండగా ఒక ఏనుగు ఒక్కసారిగా మావటిని కింద వేసి తొక్కివేయడంతో అతనికి రక్త వాంతులు అయ్యాయి. దీంతో భక్తులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. గాయపడిన మావటిని 108 సాయంతో స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement