breaking news
tiruchanooru
-
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏనుగు బీభత్సం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఏనుగులు భీభత్సం సృష్టించడంతో మావటి చంద్రారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రతిరోజూ సాయంత్రం అమ్మవారి వాహన మండపంలో ఉంజల్ సేవ నిర్వహిస్తారు. ఆ సమయంలో టీటీడీకి సంబంధించిన ఏనుగులు ఆలయం వద్దకు తీసుకురావడం ఆనవాయతీ. ఊంజల్ సేవ పూర్తైన తరువాత ఏనుగులను తిరిగి ఉద్యానవనానికి తీసుకెళుతుండగా ఒక ఏనుగు ఒక్కసారిగా మావటిని కింద వేసి తొక్కివేయడంతో అతనికి రక్త వాంతులు అయ్యాయి. దీంతో భక్తులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. గాయపడిన మావటిని 108 సాయంతో స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
23నుంచి తిరుచానూరులో శతచండీయాగం
రాజమహేంద్రవరం కల్చరల్: నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు తిరుచానూరులో శతచండీయాగాన్ని నిర్వహిస్తున్నట్టు అరుణాచల అన్నపూర్ణ ఆశ్రమ పీఠాధిపతి శివానందలహరి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఈ యాగానికి ఆహ్వానిస్తామని శుక్రవారం ఆయన స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో తెలియజేశారు.శతచండీయాగం పోస్టరును ఆయన ఆవిష్కరించారు. ఆయన వెంట శిష్యులు ఎం.శ్రీనివాసరావు, బోడపాటి చక్రవర్తి, తుర్లపాటి శ్రీనివాసరావు, నాగేంద్రకుమార్ తదితరులు ఉన్నారు.


