కోవిడ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ షురూ | Covid-19 vaccine trials begin | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ షురూ

Oct 6 2020 4:29 AM | Updated on Oct 6 2020 8:53 AM

Covid-19 vaccine trials begin - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేజీహెచ్‌లో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌.. కోవీషీల్డ్‌ ట్రయల్స్‌ సోమవారం ప్రారంభమయ్యాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసిన సంగతి తెలిసిందే. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సంయుక్తంగా కేజీహెచ్‌లో వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు శ్రీకారం చుట్టాయి.

తొలి రోజు ఆంధ్రా మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ పర్యవేక్షణలో కేజీహెచ్‌లో ముగ్గురు (ఇద్దరు పురుషులు, ఒక మహిళ) ఆరోగ్యవంతులకు వ్యాక్సిన్‌ ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.  వ్యాక్సిన్‌ ఇచ్చిన 57, 90, 180వ రోజుల్లో వారి నుంచి రక్త నమూనాలు సేకరించి.. వారి పరిస్థితి ఎలా ఉందో పరిశీలిస్తారు.  

Advertisement
 
Advertisement
Advertisement