కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజ్‌ 70 గేట్లు ఎత్తివేత | Continued Flood To Prakasam Barrage | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజ్‌ 70 గేట్లు ఎత్తివేత

Aug 8 2024 7:14 AM | Updated on Aug 8 2024 9:12 AM

Continued Flood To Prakasam Barrage

ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు కొనసాగుతోంది. 70 గేట్లు ఎత్తి దిగవకు నీటిని విడుదల చేస్తున్నారు.

సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు కొనసాగుతోంది. 70 గేట్లు ఎత్తి దిగవకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానదీ పరీవాహక ప్రాంత,లంక గ్రామ ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని.. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని పేర్కొంది. అత్యవసర సహాయం కోసం 1070,112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు  డయల్ చేయాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి వరద నీరు  కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,30,632, ఔట్ ఫ్లో 3,74,309 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ  215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.5056 టీఎంసీలు. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
 

పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద
సూర్యాపేట జిల్లా: పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. 11 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 2,57,779, అవుట్ ఫ్లో 2,45,682 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం: 175 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం: 167.94 అడుగులు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ: 31.89 టీఎంసీలుగా కొనసాగుతోంది.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement