బాల్య వివాహాల కట్టడికి కఠిన చర్యలు | Ap Govt Strict Action On Child marriage Under Related Act 2006 | Sakshi
Sakshi News home page

AP: బాల్య వివాహాల కట్టడికి కఠిన చర్యలు.. 20 ఏళ్లు జైలు శిక్ష తప్పదు!

Jan 20 2023 2:49 PM | Updated on Jan 20 2023 2:56 PM

Ap Govt Strict Action On Child marriage Under Related Act 2006 - Sakshi

సాక్షి,  అమరావతి: ఆంధ్ర­ప్రదేశ్‌లో బాల్య వివాహాల కట్టడికి ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టింది. గతంతో పోలి్చతే రాష్ట్రంలో బాల్య వివాహాల రేటు తగ్గినప్పటికీ ప్రజలు, ప్ర­భు­త్వ శాఖల సమన్వయంతో వాటిని మరింతగా కట్టడి చేయాలని ప్రభు­త్వం నిర్ణయించింది. ఈ విషయమై ఆంధ్ర­ప్రదేశ్‌ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర అన్ని జిల్లా­ల అధికారులకు ఉత్తర్వులు జా­రీ చేశారు.  

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మిషన్‌ వాత్సల్య, బాల్య వివాహ నిరోధక చట్టం–2006, ఏపీ నియమాలు–2012ను అనుసరించి బాల్య వివాహాల నివారణ కోసం వరుడు, వధువు, వారి తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మెమోలో పేర్కొన్న అంశాలు ఇవి..
►బాల్య వివాహాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. బాల్య వి­వా­­హ నిరోధక, పోక్సో చట్టాల ప్రకా­రం విధిం­చే శిక్షలపై ప్రజలకు తెలియజేయాలి.  
►మైనర్‌ బాలికను వివాహం చేసుకుని, ఆమెతో సంసారం చేస్తే బాల్య వివాహ చట్టం–2006, పోక్సో చట్టం–2012 (సవరణ చట్టం–2019) ప్రకారం శిక్ష తప్పదు.
►మైనర్‌ బాలికను వివాహం చేసుకున్న వరుడికి బాల్య వివాహ నిషేధ చట్టం–2006లోని సెక్షన్‌ 9 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, రూ.­లక్ష  జరిమానా, లేదా రెండూ కలిపి విధించవచ్చు.  
►బాల్య వివాహంతో 18 ఏళ్లలోపు బాలికతో సంసారం చేస్తే అత్యాచారం కేసుగా నమోదు చేసి పోక్సో సవరణ చట్టం–2019 సెక్షన్‌ 4(జీ) ప్ర­కా­రం పదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష, జరిమానా, జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. 
►16 ఏళ్ల లోపు బాలికను వివాహం చేసుకుని సంసారం చేస్తే అత్యాచారం కేసులో పోక్సో సవరణ చట్టం–2019 సెక్షన్‌ 4(జీజీ) ప్రకారం ఇరవై సంవత్సరాలకంటే తక్కువ కాకుండా జైలు శిక్ష, జరిమానా, జీవిత ఖైదు విధిస్తారు. 
► బాల్య వివాహాలు నిర్వహించిన వరుడు, వధువు తల్లిదండ్రులకు, వారి బంధువులకు శిక్ష తప్పుదు. వారికి రెండేళ్లు జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తారు. వీరికి పోక్సో చట్టం–2012 సెక్షన్‌ 17 ప్రకారం కూడా శిక్ష పడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement